కాకినాడ తీరంలో సింగపూరు సంస్ధ ఓడరేవు

కేజీ బేసిన్ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆయిల్, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలు ఇతర కార్యకలాపాల కారణంగా ఈ ప్రాంతంలో షిప్పింగ్ వ్యాపారం పెద్ద ఎత్తున పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్బంగా వ్యక్తం చేశారు. ఎస్‌కెఎల్ జాయింట్ వెంచర్‌లో సెంబ్ కార్ప్‌మెరైన్ తొలివిడతగా 5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి 19.9 శాతం వాటాను తీసుకుంటుందని, తమ వాటాను 40 శాతం వరకు పెంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటామని ఫూకీ తెలిపారు.
ఈ ప్రతిపాదిత ఓడరేవులో వివిధ రకాల ఓడలకు మరమ్మతులు చేసే సౌకర్యంతో పాటు కొత్త వెసెల్స్, షిప్స్ నిర్మాణానికి కావలసిన వసతులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్‌కె ఎల్ డైరెక్టర్ క్రిస్ కె. నిట్టల తెలిపారు.మన దేశానికి చెందిన ఓడలు ప్రస్తుతం మరమ్మతుల కోసం సింగపూర్‌కు వెళుతున్నాయని, ఇందుకు గాను 20 లక్షల డాలర్ల నుంచి 2 కోట్ల డాలర్ల వరకు వ్యయం అవుతుందని, ఈ రకమైన వ్యాపారం ఎస్‌కెఎల్‌కు మళ్లే అవకాశం ఉందని నిట్టల తెలిపారు. విశాఖ పట్నం- చెన్నయ్ ఓడరేవుల మధ్య అత్యంత కీలకమైన ప్రాంతంలో ఎస్‌కెఎల్ పోర్టును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications