'గాలి' వజ్ర కిరీటంపై టిటిడి మల్లగుల్లాలు

Gali Janardhan Reddy
తిరుపతి: గాలి జనార్దన్ రెడ్డి శ్రీవారికి సమర్పించిన అత్యంత విలువైన వజ్ర కిరీటం విలువపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి మల్లగుల్లాలు పడుతోంది. ఆ వజ్ర కిరీటానికి సంబంధించిన రశీదును గాలి జనార్దన్ రెడ్డి ఇవ్వకపోవడంతో టిటిడికి ఈ సమస్య తలెత్తింది. గాలి జనార్దన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి జూన్ నెలలో శ్రీవారికి వజ్ర కిరీటం సమర్పించారు. అది 45 కోట్ల రూపాయల విలువ చేస్తుందని కూడా ఆయన చెప్పారు. వజ్రాలతో పొదిగిన ఆ కిరీటం 34 తులాల బంగారంతో తయారైంది. చాలా అట్టహాసంగా ఊరేగింపు జరిపి ఆ వజ్ర కిరీటాన్ని గాలి జనార్దన్ రెడ్డి సమర్పించారు.

గాలి జనార్దన్ రెడ్డి నుంచి రశీదును ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఇప్పుడు టిటిడి పాలక మండలిలో చర్చ సాగుతోంది. అది నలుపా, తెలుపా అనే విషయంపై కూడా సందిగ్ధంలో పడుతున్నారు. అయితే, గాలి జనార్దన్ రెడ్డి అట్టహాసంగా అందరికీ తెలిసే విధంగా దాన్ని సమర్పించినందున నలుపా, తెలుపా అనే సందేహాలు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి శ్రీవారి ఆభరణాలను లెక్కిస్తారు. ఈ సమయంలో వజ్ర కిరీటం ధరపై సందేహాలు తలెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+