రెచ్చగొట్టవద్దు: ప్రభుత్వానికి ఈటెల హెచ్చరిక

సోమవారం బంద్ ముగిసిన తర్వాత తమ తదుపరి కార్యక్రమంపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం పార్టీలకు, సిద్ధాంతాలకు, జెండాలకు సంబంధించింది కాదని, అందువల్ల అందరూ తెలంగాణ కోసం ముందుకు రావాలని ఆయన కోరారు. తమ పార్టీ నేత కె. చంద్రశేఖర రావుకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తాము ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెదక్ డిపో వద్ద ఆమె ప్రదర్శన నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications