పాక్షి ప్రతుల దగ్ధం: క్రిస్టోఫర్ ఇంటిపై దాడి

హైదరాబాద్: మహబూబ్ నగర్ లో పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేశారు. తెలంగాణ వ్యతిరేక వార్తా కథనాలు ప్రచురించినందుకు నిరసనగా విద్యార్థులు సాక్షి దిన పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి కార్యదర్శి క్రిస్టోఫర్ ఇంటిపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన బంధువు క్రిస్టోఫర్ ను ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా వేసి ఉస్మానియా విద్యార్థుల మనోభాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.

ఉస్మానియాలో విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు చెప్పారు. పోలీసులు లేకపోతే విద్యార్థులు ప్రశాంతంగా ఉంటారని వారు చెప్పారు. సికింద్రాబాదులోని పిజి కళాశాల విద్యార్థులు అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. తెలంగాణలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కరీంనగర్, వరంగల్, సూర్యాపేట వంటి పలు ప్రాంతాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+