తెలంగాణ అంతటా తెరాస బంద్

RTC Bus Bandh
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా సోమవారం తెలంగాణ అంతటా బంద్ కొనసాగుతోంది. తెలంగాణలోని పలు బస్ స్టాండ్ల వద్ద తెరాస కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనలకు దిగారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నిజామాబాద్ లో బస్ డిపో వద్ద ప్రదర్శనకు యత్నించిన తెరాస నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయినా బస్సులు నడవడం లేదు. ప్రజలే స్వయంగా బంద్ పాటిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.

విద్యాసంస్థలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. సింగరేణిలో కూడా బంద్ సాగుతోంది. హైదరాబాద్ లోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో కూడా బస్సులు నడవడం లేదు. రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి తదితర ప్రాంతాల్లో కూడా బస్సులు తిరగడం లేదు. తెలంగాణలోని బస్సు స్టాండ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. రద్దీగా ఉండే హైదరాబాదులోని కోఠీ, తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు కనిపించడం లేదు. హైదరాబాదులో మునుపెన్నడూ లేని వాతావరణం నెలకొని ఉంది. ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ ఓదెలులో తెరాస కార్యకర్తలు రైలు రోకో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+