తోసుకొచ్చిన కెసిఆర్: తోపులాట, ఉద్రిక్తత

K Chandrasekhar Rao
ఖమ్మం: తనను ప్రభుత్వాస్పత్రిలో నిర్బంధించడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అక్రమ నిర్బంధంపై న్యాయమూర్తికి వివరించేందుకు వెళ్తానంటూ ఆయన ప్రభుత్వాస్పత్రి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో గ్రేహౌండ్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి పొడుచుకోవడానికి కూడా ఆయన ప్రయత్నించినట్లు ఆస్పత్రి లోపలి నుంచి బయటకు వచ్చినవారు చెబుతున్నారు. దాన్ని తాము అడ్డుకున్నామని వారు చెప్పారు. తోపులాట కెసిఆర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ను ఉంచిన ప్రభుత్వాస్పత్రి గదిలో అద్దాలు పగిలిపోయాయి.

ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని, తనపై దుష్ప్రచారానికి ఒడిగట్టిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించినట్లు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని ఆయన అంటున్నారు. దీన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, తన వాదనను న్యాయమూర్తి ముందు వివరించేందుకు అవకాశం కల్పించాలని ఆయన అంటున్నారు. కెసిఆర్ ఉన్న గదిలోకి మీడియాను వెళ్లనీయడం లేదు. దీంతో లోపల ఏం జరుగుతోందనే విషయం తెలియడం లేదు. కెసిఆర్ ను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని తెరాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు పెద్ద యెత్తున తెరాస కార్యకర్తలు చేరుకుంటున్నారు. తనను అక్రమంగా ప్రభుత్వాస్పత్రిలో నిర్బంధించారని కెసిఆర్ ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వ వైద్య పరీక్షలను కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను కెసిఆర్ వద్దకు పంపారు. సెలైన్ ఎక్కించుకోవడం లేదని తెలుస్తోంది. మందులు కూడా ఆయన తీసుకోవడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+