బెజవాడలో 24 గంటలు, రోశయ్య టూర్ స్కెచ్

ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ముందస్తుగానే స్థానికుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూడడం కోసం జ్వరాలను ఆరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాకకు ముందే "రచ్చబండ" కార్యక్రమాన్ని రెపు నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మృతి చెందిన రోజును సంస్మరించుకుంటూ బుధవారం నగరంలో 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. బీసెంట్‌రోడ్డులోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడుతూ, సెప్టెంబరు 2వతేదీన వైఎస్ మరణించారని, ఆయన తలపెట్టిన పథకాలను మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications