వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నర్సీపట్నం కోర్టుకు కోబాడ్ గాంధీ, ఉద్రిక్తత

గాంధీని నర్సీపట్నం కోర్టులో హాజరుపరచడానికి తీసుకువస్తున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం వచ్చే అన్ని మార్గాల్లోను వాహనాల తనిఖీ చేపట్టారు. నర్సీపట్నం నుంచి చింతపల్లి, కేడిపేట, తుని, అనకాపల్లి వైపు వెళ్లే రహదార్లుపై పోలీసు నిఘా పెట్టారు. లొంగిపోయిన గిరిజన మిలీషియా సభ్యులను నర్సీపట్నం టౌన్‌లో అనుమానిత ప్రాంతాల్లోను ఉపయోగించుకున్నారు.
విశాఖ ఏజెన్సీలోని జికెవీధి మండలం గునుకురాయిలో జరిగిన ఎన్‌కౌంటర్ కేసులోను, చింతపల్లి మండలంలో కొన్ని చోట్ల జరిగిన దోపిడి ఘటనల్లోను గాంధీకి సంబంధం ఉందనే నేరం కింద చింతపల్లి కోర్టులో హాజరుపర్చడానికి హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి తీసుకువచ్చారు. గునుకురాయి ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులతో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా చనిపోయారు.