హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రోశయ్య అత్యవసరంగా సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై రోశయ్య సచివాలయంలో మంత్రులతో చర్చించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, శాంతిభద్రతల అంశాలు చర్చకు వచ్చాయి.