తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఎఐసిసి ప్రతినిధి

ఇలా ఉండగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం సోమవారం సాయంత్రంలోగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు కూడా సాయంత్రంలోగా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమించకపోవడం వల్ల, తెలంగాణలోని అన్ని వర్గాలు ఆందోళనకు దిగడం వల్ల ఒక ప్రకటన చేస్తే తప్ప చల్లారదనే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. రాజకీయంగా కూడా కాంగ్రెసుపై ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications