హైదరాబాద్: ప్రభుత్వం ఇదే మొండి వైఖరి అవలంబిస్తే తన శవాన్ని చూడాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తాను దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన ఒక టీవీ చానెల్ ప్రతినిధులతో మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ గురించి తెలుసుకుని కెసీఆర్ కలత చెందారు. పోలీసుల దాడిని ఆయన ఖండించారు. ఉస్మానియా ఘటనపై నిరసన తెలుపుతూ చికిత్స చేయించుకునేందుకు నిరాకరించారు.
కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు చెప్పారు. కెసిఆర్ వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ కు నచ్చజెప్పి వైద్యం చేస్తున్నట్లు వారు తెలిపారు. గత తొమ్మిది రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కెసిఆర్ బలహీనంగా ఉన్నట్లు వారు చెప్పారు.