సోనియాకు కాంగ్రెసు ఎమ్మెల్సీల లేఖ

కాగా, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి నివాసంలో సమావేశమైన కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రేపు సోనియా గాంధీకి లేఖ రాయనున్నారు. ఈ విషయాన్ని దామోదర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం మాజీ హోం మంత్రి కె. జానారెడ్డి, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి గత రెండు రోజులుగా మంతనాలు జరుపుతున్నారు. కాగా, తెలంగాణ విషయంలో తాము తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాయలసీమకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ సేవలు రాష్ట్రానికి ఎంతైనా అవసరసమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ దీక్ష విరమించాలని ఆయన అన్నారు.