తెలంగాణ లొల్లి: అసెంబ్లీ పావు గంట వాయిదా

తమ నాయకుడు కె.చంద్రశేఖర రావు దీక్ష చేస్తూ చావుబతుకుల్లో ఉన్నారని, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తూ తెలంగాణ కావాలని ఉద్యమిస్తున్నారని, ఈ స్థితిలో సభలో వేరే విషయాలు చర్చించడం భావ్యం కాదని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మైక్ ను కట్ చేసి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించడానికి స్పీకర్ పూనుకున్నారు. ఈ సమయంలో తెరాస సభ్యులు ప్లకార్డులు తీసి నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బుధవారం సభలోపల, వెలుపల జై తెలంగాణ నినాదాలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications