చేతులెత్తేసిన కాంగ్రెసు కోర్ కమిటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్యంపై కోర్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీక్ష విరమించాలని కోర్ కమిటీ కెసిఆర్ కు విజ్ఞప్తి చేసింది. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని, ఇది సున్నితమైన విషయమని మొయిలీ అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని కెసిఆర్ దీక్ష విరమించాలని కోర్ కమిటీ కోరింది. కోర్ కమిటీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ, ఆంటోనీ, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ తదితరులు పాల్గొన్నారు. దీక్ష విరమించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కెసిఆర్ కు ఫోన్ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications