వరంగల్ లో కాంగ్రెస్ నేతలను చితకబాదిన తెలంగాణ వాదులు

దీక్షలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విభాగం కాంగ్రెస్ నాయకుడు చింతా ప్రకాష్, బుచ్చిరెడ్డి, వెంకటనర్సయ్యతో పాటు మరి కొంత మంది కాంగ్రెస్ నాయకుల వాహనాలతో కాళోజీ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. జెండాలు చేతబూని దీక్షా శిబిరం వద్దకు ప్రవేశిం చగానే తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణను ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సోనియాగాంధీ బొమ్మలు ఉన్న జెండాలతో దీక్షా శిబిరంలోకి రావద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయితే తాము దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చామని, తెలంగాణ కోసం నినదిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications