చికిత్స, సెలైన్ లను నిరాకరిస్తున్న కెసిఆర్

ప్రభుత్వం కదిలి రాకపోవడంతో ఆయన తీవ్ర నిరనన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా, కెసిఆర్ దీక్ష విరమించడానికి వీలైన ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ మేధావులు రంగంలోకి దిగుతున్నారు. కెసిఆర్ చేత దీక్ష విరమింపజేసేందుకు పూనుకుంటున్నారు. తెలంగాణ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, మేధావులు నిమ్స్ కు వెళ్లి దీక్ష విరమించాలని కోరే అవకాశం ఉంది. కెసిఆర్ మరణించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయనే ఆందోళన తెలంగాణలో నెలకొంది.












Click it and Unblock the Notifications