తెలంగాణేతర ఎంపీలకు సోనియా బుజ్జగింపు

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సోనియాకు అన్ని విషయాలు చెప్పామని, ఈ రాత్రికి అధిష్ఠానం నిర్ణయం చెబుతామని సోనియా తమకు చెప్పారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఆంధ్ర ప్రాంత ప్రజల, ప్రజాప్రతినిధుల మనోభావనలు దెబ్బతిన్న విషయం సోనియాకు తెలియజేశామన్నారు. భావోద్వేగాలకు లోను కావద్దని ఆమె సూచించారన్నారు.












Click it and Unblock the Notifications