ఇక్కడో డ్రామా, ఢిల్లీలో మరోటి: జూలకంటి

ప్రాంతీయ తత్వాలను మరింత పెంచే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. నిర్దిష్టమైన ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెసు ముందుకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ అంశం ఢిల్లీ కోర్టులో ఉందని రోశయ్య, అసెంబ్లీకి అప్పగించామని కేంద్రం చెప్పాయని, ఇది కాంగ్రెసు నాటకమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకోసం పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ఆరు సూత్రాల పథకాన్ని, 610 జీవోను అమలు చేయకపోవడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications