గ్రేటర్ హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలి: దానం
Districts
oi-Santaram
By Santaram
హైదరాబాద్: రాష్ట్రాల విభజన జరిగితే గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరతామని, అంతిమంగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతానని వైద్యారోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ''ప్రత్యేక తెలంగాణ ఏర్పాటా, సమైక్యమేనా అనేది అధిష్ఠానం నిర్ణయం. కాంగ్రెస్‌లో ఏ నిర్ణయమైనా అధిష్ఠానానిదే. ఒకసారి అక్కడ నిర్ణయం జరిగిందంటే దాన్ని మేం వ్యతిరేకించం. ప్రకటనకు ముందు మా అభిప్రాయాలు అడిగితే గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలనే ఇక్కడి ప్రజల మనోభావాల్ని అధిష్ఠానం ముందు ఉంచుతా'' అని మంత్రి అన్నారు.
గతంలో కూడా దానం నాగేందర్ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరి వివాదాస్పదులయ్యారు. అందుకు నిరసనగా తెలంగాణ వాద విద్యార్ధులు ఆయన నివాసాన్ని చుట్టిముట్టి నిరసన వ్యక్తం చేశారు.