తిరుమలలో ఈ నెల 16 నుంచి..: ఎంట్రీ ఫీజు రూ. 50 గా నిర్ధారించిన టీటీడీ

తిరుమల క్షేత్ర మహత్యాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ కొనసాగుతోంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ మ్యూజియం ట్రయల్ రన్ ను టీటీడీ పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది.

ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తిస్థాయిలో దీనిని ప్రారంభించడానికి ముందుగా ఈ ట్రయల్ రన్ చేపట్టింది టీటీడీ. ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతి ఇస్తారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక మీడియా ప్రతినిధులు, వారి కుటుంబాలు ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చు.

Devotees will be allowed to visit the SV museum from November 16 onwards entry fee has been fixed

అలాగే.. శ్రీవారి సేవకులు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం 16వ తేదీ నుండి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతిస్తారు. ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా నిర్ధారించారు.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో స్వామివారి నిత్య సేవలు, ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, ప్రాచీన ఆభరణాల నమూనాలు, చారిత్రక నాణేలు, రాగిరేకులు, రాతి శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. భక్తులకు నూతన తరహా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు వర్చువల్ రియాలిటీ సాంకేతికత, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇంటరాక్టివ్ కియోస్క్‌, డిజిటల్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు.

ప్రస్తుతం చేపట్టిన ఈ ట్రయల్ రన్ ద్వారా మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ డిజిటల్ సాంకేతిక పరికరాల పనితీరు, సందర్శకుల రద్దీ నిర్వహణను టీటీడీ పరిశీలిస్తోంది. ప్రదర్శనను తిలకించిన వివిధ వర్గాల నుంచి స్వీకరించే అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ఇందులో అవసరమైన చిన్న మార్పులు చేయనున్నారు. ఈ ట్రయల్ రన్ 15వ తేదీతో ముగుస్తుంది. 16వ తేదీ నుంచి అనంతరం తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మ్యూజియం ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+