శుక్రుని దయతో డిసెంబర్ నుండి ఈ రాశులకు ధనకనక వస్తు లాభాలు!

వైదిక జ్యోతిషశాస్త్రంలో రాక్షస గురువైన శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ, సౌందర్యం, లగ్జరీ, ఆకర్షణ, దాంపత్య సుఖం మరియు అపార సంపదకు ఆయనే కారకుడు. శుక్రుడు రాశి లేదా నక్షత్రం మారిన ప్రతిసారీ మానవ జీవితాలపై బలమైన ముద్ర వేస్తాడు. 2026 డిసెంబర్ 5న శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోని స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు.

స్వాతి నక్షత్రానికి అధిపతి ఛాయాగ్రహమైన రాహువు. జ్యోతిష్య సూత్రాల ప్రకారం శుక్రుడు, రాహువులు పరస్పర మిత్ర గ్రహాలు. మిత్ర క్షేత్ర నక్షత్ర సంచారంతో పాటు ఏర్పడే శుభ యోగాల వల్ల పలు రాశుల వారి జీవితాల్లో ఊహించని ధనలాభం, వృత్తిపరమైన ఎదుగుదల, కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తాయి

మేష రాశి

మేష రాశి వారికి ఈ సంచారంతో పెండింగ్‌లో ఉన్న కీలక పనులన్నీ వేగవంతమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న వివాదాలు సమసిపోతాయి. పూర్వీకుల లేదా స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయం. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభిస్తుంది.

Venus Transit in Swati Nakshatra December 2026 5 Zodiac Signs Set for Wealth amp amp Love

మిథున రాశి

మిథున రాశి వారికి గతంలో పడిన శ్రమకు ఇప్పుడు అద్భుతమైన ప్రతిఫలం లభించబోతోంది.ఆదాయ మార్గాలు అనూహ్యంగా విస్తరిస్తాయి. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం అందుతుంది. కార్యాలయంలో ఇప్పటివరకు ఎదురైన సమస్యలు, తోటి ఉద్యోగులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఇంట్లో నిశ్చయమవుతాయి.

తులా రాశి

శుక్రుని స్వంత రాశి అయిన తులా రాశిలోని స్వాతి నక్షత్రంలోనే ఈ సంచారం జరుగుతుండటంతో, వీరికి అత్యంత రాజభోగాలు పట్టనున్నాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ దీర్ఘకాలిక కలలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది. సొంతంగా కొత్త వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి తల్లిదండ్రుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి పూర్తి ఆర్థిక మద్దతు లభిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది పెట్టుబడులు, షేర్ల ద్వారా భారీ లాభాలు గడించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. చేపట్టిన ప్రతి ప్రయత్నంలోనూ ఎదురులేని విజయం మీ సొంతమవుతుంది. వ్యాపార విస్తరణ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.

దీపావళి తర్వాత బుధుడి ఉదయం.. ఈ రాశుల వారికి సువర్ణ కాలం!
దీపావళి తర్వాత బుధుడి ఉదయం.. ఈ రాశుల వారికి సువర్ణ కాలం!

మకర రాశి

మకర రాశి వారి జీవితంలో డిసెంబర్ నెల సానుకూల విప్లవాన్ని తీసుకురానుంది. భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకం, ప్రేమానురాగాలు రెట్టింపవుతాయి. గతంలో ఉన్న చిన్నపాటి కలహాలు దూరమై శాంతి నెలకొంటుంది. నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశాలు లభిస్తాయి. మీ పాత కోరికలు, కలలు నెరవేరడంతో పాటు భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న సరికొత్త లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+