బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో మొన్నటికి మొన్న మురసు తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీని ధాటికి ఏడు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంట నీటిపాలైంది. 69,828 మంది రైతులు ప్రభావితం అయ్యారు. వీటిలో 45,900 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ఒక్క వ్యవసాయ శాఖలోనే రూ. 324.22 కోట్ల నష్టం సంభవించింది. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా నమోదైంది. ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి.

దీని నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 13వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. తూర్పు తీరంలో దీని ప్రభావం అధికంగా ఉండొచ్చు. ఏపీ, ఒడిశా, తమిళనాడుల్లో పలు తీరప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

APSDMA Predicts the possibility of Light to moderate rains in several parts of Andhra Pradesh today

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు.. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.

తిరుమలలో ఈ నెల 16 నుంచి..: ఎంట్రీ ఫీజు రూ. 50 గా నిర్ధారించిన టీటీడీ
తిరుమలలో ఈ నెల 16 నుంచి..: ఎంట్రీ ఫీజు రూ. 50 గా నిర్ధారించిన టీటీడీ

అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగులు, శిథిల భవనాలు, చెట్ల కింద నిల్చోకూడదని సూచించారు. మొదట ఆర్ణబ్, ఆ తర్వాత మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు

భారీ వర్షాల వల్ల కొన్ని చోట్ల వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తోన్నాయని గుర్తు చేశారు. నీట మునిగిన కాజ్‌వేలను దాటే ప్రయత్నం చేయవద్దని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+