హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌లో దీక్షకు దిగితే అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లగడపాటి దీక్షపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే హైదరాబాద్ వేదిక కాకూడదన్నారు. విజయవాడ లేక మరే ఇతర ప్రాంతాల్లో చేసుకుంటే మంచిదన్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌లోకి గూండాలు ప్రవేశిస్తే రక్తపాతం జరుగుతుందనే విషయాన్ని లగడపాటి గమనించాలని హెచ్చరించారు. పైసా లేకుండా నగరానికి వచ్చి కోట్లకు పడగలెత్తిన విజయవాడ ప్రస్తుత ఎంపీ ఇప్పుడు ఆ డబ్బుతోనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని పాల్వాయి ఆరోపించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి