బలవంతంగా విజయవాడకు లగడపాటి

సమైక్యాంధ్ర కోసం తెలుగుజాతి అంతా కలిసి పోరాడుతుందని ఆయన చెప్పారు. తమ సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. విజయవాడ ఉద్యమాల గడ్డ అని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర నిశబ్ద విప్లవం ప్రారంభమైందని ఆయన అన్నారు. తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు జాతి సమైక్యతను కాపాడుతానని ఆయన హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications