విజయవాడ: తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు, బొడ్డా ఉమా మహేశ్వర రావు ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి మరోసారి గురువారం పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఇద్దరు కూడా పక్కనే ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయం గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకున్నారు. ఆ గదిలోనే వారు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్రను కోరుతూ వారు గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి ఉమా మహేశ్వర రావుతో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఆ తర్వాత గురువారం తెల్లవారు జామున ఆయనను అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి