హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకున్న ప్రజారాజ్యం పార్టీని తెలంగాణలో కాలు పెట్టనివ్వరని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. అత్యధిక ప్రజల అభీష్టం మేరకు తాను సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పిన చిరంజీవిని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. తెలంగాణ మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
మెజారిటీ పేరుతో చిరంజీవి రాజకీయాలు చేయడం సరి కాదని, సంఖ్యా బలం పేరుతో విర్రవీగడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ ప్రజలు చిరంజీవి అడుగు పెట్టబోరని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి