న్యూఢిల్లీ: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) తవ్వకాలకు సుప్రీంకోర్టు గురువారం బ్రేక్ వేసింది. ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.
హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఓఎంసీ తవ్వకాలను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ వ్యవహారాలపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రోశయ్యకు ఒక లేఖ రాశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి