కృష్ణా, గుంటూరు జిల్లాలో 48 గంటల బంద్ మొదలు

శుక్ర, శనివారాల్లో జిల్లాలో 48 గంటల సంపూర్ణ బంద్‌కు సమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఈరెండురోజులు బంద్ మరింత ఉధృతం చేసేందుకు జేఏసీ బంద్‌ను పాటించనుంది.
నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ పటిష్టంగా జరిగేందుకు జాయింట్ యాక్సిన్ కమిషన్ గురువారం నగరంలో ఉన్న స్థానిక స్వాత్రంత్య సమర యోధుల భవనంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా, గాంధీయ వాదంగా ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు ఉద్యమాలను భగ్నం చేసి ప్రజలను, ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని జే ఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.
రెండు వేల మంది ఉద్యమకారుల మధ్య నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, నేతలను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్ళడాన్ని జే ఏసీ తీవ్రంగా ఖండించింది.












Click it and Unblock the Notifications