చిరంజీవి 'సమైక్య'తో హైదరాబాద్ ప్రజారాజ్యం ఖాళీ

చిరంజీవి నిర్ణయం తమను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, ఆయన తెలంగాణ ప్రజలను వంచించారని, చరిత్ర హీనుడుగా మిగులుతారని, కేవలం స్వార్థం కోసమే చిరంజీవి ఆ నిర్ణయం తీసుకున్నారని పీఆర్పీ నాయకులందరూ ముక్తకంఠంతో నిరసన వ్యక్తంచేస్తున్నారు.
గ్రేటర్‌లోని 150 వార్డుల నాయకులందరూ ఇదేస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 12లక్షల మంది ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.సామాజిక తెలంగాణ అనే నినాదానికి ఆకర్షితులమై తాము పార్టీ జెండాను భుజాన వేసుకుని మోశామని, తీరా తెలంగాణ ప్రకటన వచ్చాక సమైక్యాంధ్రకు జై కొట్టడంపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఎందరో పార్టీని వీడి వెళ్లినా, తీవ్ర విమర్శలు చేసినా తాము భరించామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిని ఎవరో తప్పుదోవ పట్టించారన్న ఆవేదనను వ్యక్తం చేస్తూనే తామిక ఆ పార్టీలో కొనసాగబోమని వేరు కుంపటి పెట్టుకుంటామని వివరించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications