తెలంగాణ లొల్లి: లోకసభ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ సభ్యులు రెండుగా విడిపోయి తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. దీంతో సభ ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో మీరా కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. కొందరు సభ్యుల తీరు అభ్యంతర కరంగా ఉందని స్పీకర్ మీరా కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications