రాంచీ: జార్ఖండ్ కు జరుగుతున్న ఎన్నికల్లో శుక్రవారం పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు గడిచినా పెద్దగా ఓటింగ్ జరగలేదు. కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జార్ఖండ్ లోని 16 శాసనసభా స్థానాలకు తుది ఐదో విడత శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. శుక్రవారంతో జార్ఖండ్ శాసనసభకు ఐదు విడతల్లో తలపెట్టిన పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
జార్ఖండ్ లోని హుస్సేనాబాద్ జిల్లా పాలమావులో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంట్లో ఒక పోలీసు గాయపడ్డాడు. అంతకు మించి అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. జార్ఖండ్ శాసనసభలో 81 స్థానాలున్నాయి. ఇప్పటి వరకు 65 స్థానాలకు పోలింగ్ జరిగింది. శుక్రవారం 16 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి