Amazon Great Summer Sale: ఫోన్లు, ఏసీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
ఎండలు మండిపోతున్న వేళ ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు చల్లని కబురు చెప్పింది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ ఏడాది సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు "గ్రేట్ సమ్మర్ సేల్" (Great Summer Sale) డేట్‌ను ఫిక్స్ చేసింది. మే 8వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే అమెజాన్ 'ప్రైమ్' సభ్యులకు ఒక రోజు ముందే అంటే మే 7 నుంచే ఈ ఆఫర్లను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. భారీ డిస్కౌంట్లు, అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమెజాన్ సర్వం సిద్ధం చేసింది.
ఈ సేల్‌లో షాపింగ్ చేసే వారు భారీగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. పాత వస్తువులను మార్చుకునే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు, ఖరీదైన వస్తువులను సులభ వాయిదాలలో కొనుగోలు చేసేందుకు 'నో-కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ఏకంగా రూ.2,500 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించారు.

గాడ్జెట్లపై క్రేజీ డీల్స్..
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ల సేల్ ఈసారి అదిరిపోనుంది. సాంసంగ్, షియోమి, ఐక్యూ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు భారీ ధరల తగ్గింపుతో లభించనున్నాయి. కేవలం ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచీలు, ఇయర్‌బడ్స్‌పై కూడా కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించారు. స్మార్ట్ టీవీలు, ఆడియో సిస్టమ్స్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయమని చెప్పొచ్చు.
ఇంటి అవసరాలకు భారీ డిస్కౌంట్లు..
వేసవిలో ఎక్కువగా అమ్ముడయ్యే ఎయిర్ కండిషనర్లు (AC), రిఫ్రిజిరేటర్లపై అమెజాన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటితో పాటు వాషింగ్ మెషీన్లు, కిచెన్ అప్లయన్సెస్‌పై 'లిమిటెడ్ పీరియడ్ డీల్స్' ఉండనున్నాయి. ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, నిత్యావసర వస్తువులపై కాంబో ఆఫర్లు, బండిల్ డీల్స్ ద్వారా తక్కువ ధరకే ఇంటికి కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆడుతూ.. పాడుతూ గెలుచుకోండి!
షాపింగ్‌ను మరింత సరదాగా మార్చేందుకు అమెజాన్ తన యాప్‌లో "స్పిన్ అండ్ విన్", క్విజ్ వంటి పోటీలను నిర్వహిస్తోంది. వీటిలో పాల్గొని గెలిచిన వారికి ఖరీదైన గాడ్జెట్లు, షాపింగ్ వోచర్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే వేగంగా అమ్ముడయ్యే "లైట్నింగ్ డీల్స్", అత్యుత్తమమైన "టాప్ 100 డీల్స్" విభాగాలను అమెజాన్ సిద్ధం చేసింది. మొత్తానికి కొత్త ఫోన్ కొనాలన్నా, ఇంటికి కొత్త ఏసీ తేవాలన్నా ఈ మే 8 నుంచి మొదలయ్యే అమెజాన్ సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!














Click it and Unblock the Notifications