నవ్వులే నవ్వులు.. చిన్న సినిమా కలెక్షన్ల ఊచకోత ???

కమెడియన్ సత్య హీరోగా, 'మత్తు వదలరా' ఫేమ్ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జెట్ లీ'. ఇప్పటికే ట్రైలర్, ప్రమోషన్లతో ఆసక్తి రేపిన ఈ చిత్రం.. మే 1న థియేటర్లలో విడుదలైంది. మరి నిజంగా ప్రేక్షకులను ఎంతవరకు అలరించగలిగింది? కామెడీ, థ్రిల్, ట్విస్టులతో వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకుందా లేదా అనే విషయాన్ని వివరంగా పరిశీలిద్దాం.

కథ:

కథలో ప్రజాపతి (అజయ్) అనే వ్యాపారవేత్త తన బ్యాంక్ ద్వారా దాదాపు ₹15,000 కోట్ల భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోతాడు. అతడిని పట్టుకోవడం కోసం ఇండియన్ ఏజెన్సీలు ప్రత్యేక ఆపరేషన్ ప్లాన్ చేస్తాయి. స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) ఈ మిషన్‌ను నడిపిస్తుంది. దుబాయ్ నుంచి అతడిని పట్టుకుని ఇండియాకు తీసుకొస్తున్న సమయంలో, అనుకోకుండా అదే విమానంలో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ప్రయాణిస్తాడు.

jetlee-movie-review-in-telugu-and-also-rating-starring-comedian-satya-directed-by-ritesh-rana

అయితే అతడికి గతం గుర్తులేని పరిస్థితి. అయితే, ఈ ఆపరేషన్‌తో అతనికి ఏదో సంబంధం ఉన్నట్లు సూచనలు కనిపిస్తాయి. అసలు వేదవ్యాస్ ఎవరు? అతనికి ఈ స్కాం‌తో సంబంధం ఏమిటి? ప్రజాపతి ఎస్కేప్ అవుతాడా? లేక ఏజెంట్లు విజయవంతమవుతారా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.

మూవీ రివ్యూ..

దర్శకుడు రితేష్ రానా తన స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో కూడా కామెడీని ప్రధానంగా తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా సత్య-వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తుంది. వన్-లైనర్లు, సిట్యుయేషనల్ హ్యూమర్ కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. అయితే, సమస్య ఎక్కడ వచ్చిందంటే... కథలో అవసరమైన థ్రిల్, ఇంటెన్సిటీ కనిపించకపోవడం. విమానం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథ అంటే ఉత్కంఠ, వేగం ఉండాలి. కానీ ఇక్కడ ఆ ఎలిమెంట్స్ మిస్సయ్యాయి.

ఇంటర్వెల్ తర్వాత సినిమా మరింత నెమ్మదిస్తుంది. కథలో కొత్త మలుపులు లేకపోవడం, లాజిక్స్‌ను పట్టించుకోకపోవడం వల్ల సెకండ్ హాఫ్ బలహీనంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కథ పూర్తిగా లూజ్ అవుతుంది.

నటీనటులు ఎలా చేశారంటే..

ఈ సినిమాకు అసలు బలం సత్యనే అని చెప్పాలి. అతని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా పెద్ద డైలాగ్స్‌ను కూడా సులభంగా చెప్పడం అతని ప్రత్యేకత.

వెన్నెల కిషోర్ తన పాత్రలో మంచి సపోర్ట్ ఇచ్చాడు. అతనితో కలిసి వచ్చే సన్నివేశాలు మంచి నవ్వులు పంచుతాయి. అజయ్ విలన్‌గా ఓకే అనిపిస్తాడు కానీ పాత్రలో బలం తక్కువగా ఉంది.

రియా సింఘా గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా బాగానే కనిపించింది.

వైవా హర్ష, ఇతర పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

jetlee-movie-review-in-telugu-and-also-rating-starring-comedian-satya-directed-by-ritesh-rana

టెక్నికల్ అంశాలు..

టెక్నికల్‌గా సినిమా బాగానే ఉంది. ముఖ్యంగా విమానం సెట్ డిజైన్, విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది.

కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది కానీ మొత్తం సినిమాను ఎలివేట్ చేయలేకపోయింది. పాటలు పెద్దగా గుర్తుండేలా లేవు.

ఎడిటింగ్ మాత్రం బలహీనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో unnecessary సీన్స్‌ను కట్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది.

హైలైట్స్:

  • సత్య కామెడీ టైమింగ్
  • ఫస్ట్ హాఫ్‌లో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు
  • విమానం నేపథ్య విజువల్స్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన కథ
  • థ్రిల్, ఇంటెన్సిటీ లేకపోవడం
  • సెకండ్ హాఫ్ స్లో నేరేషన్
  • లాజిక్‌లకు విరుద్ధమైన సన్నివేశాలు
  • క్లైమాక్స్ నిరాశపరచడం

పంచ్ లైన్: నవ్వులు కొంచెమే

రేటింగ్..

2.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+