ఏపీ మీదుగా ఢిల్లీ, వారణాశి, త్రివేండ్రం కు కొత్త రైళ్లు- మైసూరుకు ప్రారంభం..!!
ఏపీ మీదుగా పలు ప్రధాన నగరాలకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి సంబంధించి రైల్వే శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. పలు ప్రధాన మార్గాల్లో వందేభారత్ సర్వీసులను కేటాయించింది. త్వరలోనే ముంబాయి - బెంగళూరు వందేభారత్ స్లీపర్ ఏపీ మీదుగా ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కాకినాడ నుంచి ఢిల్లీ, వారణాసి, త్రివేండ్రం కు కొత్త రైలు సర్వీసుల ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా.. కాకినాడ నుంచి మైసూరు కు కొత్త రైలు ప్రారంభించారు.
ఏపీ నుంచి కొత్తగా ప్రధాన నగరాలకు రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా కాకినాడ నుంచి మైసూరుకు వెళ్లే రైలును కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి వెళ్తుంది. ఈ రైలు ప్రయాణం వల్ల ఎంతోమందికి ఉపయోగం గా ఉంటుందని ఎంపీ తంగెళ్ల ఉదయ్ చెప్పారు. ఈ ప్రయాణం రైతులకు, తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. 75 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ పథకంలో భాగంగా కాకినాడ, సామర్లకోట, తుని, పిఠాపురం రైల్వే స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తామన్నారు. కోస్తా రైల్వే క్యారిడార్ నిమిత్తం తాను పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చానని, అలాగే తుని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా తన వంతు కృషి చేస్తానన్నారు.

ఏపీ మీదుగా కొత్త రైళ్ల ప్రకటన పై కసరత్తు
అదే విధంగా కాకినాడ నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ, వారణాసి, జోధ్పూర్, త్రివేండ్రం లకు రైలు సర్వీసులు నడిపేందుకు కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎంపీ చెప్పారు. కాకినాడ నుండి మైసూరు వెళ్లే ఈ రైలు సుమారు 32 స్టేషన్లో ఆగుతుందని ఇది ఎంతో ఉపయోగ పడుతుందని ఉదయ్ శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగ ళూరు కు వందేభారత్ స్లీపర్ పైన నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి. కాగా.. త్వరలో విశాఖ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 10న ప్రధాని హైదరాబాద్ పర్యటన సమయంలో కొత్త స్టేషన్లను ప్రారంభించనున్నారు. కాగా.. వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా వందేభారత్ స్లీపర్ పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.













Click it and Unblock the Notifications