విజయవాడ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ కు విజయవాడలోనే వైద్య సేవలు అందిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ పియూష్ కూమార్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లగడపాటిని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్, ఎస్పీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం ఉదయం పరామర్శించారు. లగడపాటి దీక్షను విరమించడానికి నిరాకరిస్తున్నారని పియూష్ కుమార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. లగడపాటిని హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించాలని డిమాండ్ వస్తోంది.
అవసరమైతే లగడపాటికి వైద్య సేవలు అందించేందుకు గుంటూరు నుంచి వైద్యలను రప్పిస్తామని పియూష్ కూమార్ చెప్పారు. లగడపాటితో పాటు ఇతర నేతల అభిప్రాయాలను సేకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తనను దీక్షా శిబిరానికి తరలించాలని లగడపాటి గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి