విజయవాడ: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపే విషయంలో తాను ఎవరికీ బెదరేది లేదని, భయపడేది లేదని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. నిరాహార దీక్ష చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను, తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావును ఆయన శనివారం పరామర్శించారు. తిరుపతిలో శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేసిన ఆయన శనివారం విజయవాడకు వచ్చారు.
రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉంటేనే మంచిదని, సమైక్యాంధ్ర ఉద్యమానికి తన సహకారం పూర్తిగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విడిపోవాలని ఉద్యమాలు సాగుతాయని, కానీ ఇక్కడ కలిసి ఉందామని ప్రపంచంలోనే వినూత్నమైన ఉద్యమం బయలుదేరిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఏ ఒక్కరి ఉద్యమమో కాదని, అందరి ఉద్యమమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రకటన తీరును ఆయన తప్పు పట్టారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి