నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఇందల్వాయి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతులు హైదరాబాద్ లోని వారాసిగూడాకు చెందినవారని తెలుస్తోంది. వారు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.