న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ గా నరసింహన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రాజ్ భవన్ లో రాసలీలలే కాకుండా అనేక కారణాల వల్ల ఎన్డీ తివారి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదించారు. 1968 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా నరసింహన్ పనిచేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి