సడన్ గా రజత్ పటిదార్ డుమ్మా
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్ ఆడుతోంది. పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జాకబ్ బెథెల్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ భారీ భాగస్వామ్యాన్ని అందించారు. పడిక్కల్ సరిగ్గా గేర్ మార్చిన సమయంలో పెవిలియన్ దారి పట్టాడు. 25 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 45 పరుగులు చేసిన పడిక్కల్ హర్ ప్రీత్ బ్రార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
కీలకమైన ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ లేకుండానే బరిలోకి దిగింది ఆర్సీబీ. ప్రాక్టీస్ సెషన్స్ లో కార్తీక్ త్యాగి విసిరిన డెలవరీ రజత్ తలను తాకిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు రజత్. అతని గైర్హాజరీలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ అనంతరం మాట్లాడాడు. రజత్ పాటిదార్ ఫిట్‌నెస్ స్థితిపై అప్‌డేట్ ఇచ్చాడు.

రజత్ పాటిదార్ అద్భుతంగా కోలుకుంటున్నాడు, సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ లో ఆడతాడని స్పష్టం చేశాడు. ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమైనదేనని, ఇందులో గెలుస్తామనే విశ్వాసం ఉందని చెప్పాడు. రజత్ పాటిదార్ అందుబాటులో లేకపోవడం వల్ల అతని స్థానంలో సుయాష్ శర్మ, జాకబ్ డఫీ స్థానంలో ఆల్ రౌండర్ రొమారియో షెప్పర్డ్ ను తీసుకున్నామని వివరించాడు.
మే 22న చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది ఆర్సీబీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కొంటుంది. పాటిదార్ ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు. 10 ఇన్నింగ్స్‌లలో 195 స్ట్రైక్ రేట్‌తో 326 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. జితేష్ ఫామ్ లో ఉండట్లేదు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో.. జేకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(కేప్టెన్, వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ ఆడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో.. ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కేప్టెన్), సూర్యాంష్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: రసిక్ సలామ్ దార్, జోర్డాన్ కాక్స్, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్, ప్రవీణ్ దూబే.












Click it and Unblock the Notifications