రజనీ కామెంట్స్ పై స్పందించిన కమల్..! 20 ఏళ్ల సీక్రెట్ బయటపెట్టి..!
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిస్ధితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్ ను కలిసేందుకు ఆహ్వానం వచ్చినా కలవకుండా, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఇంటికెళ్లి మరీ కలిసిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై విమర్శలు వచ్చాయి. విజయ్ పై అసూయ వల్లే ఆయన్ను రజనీ పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకు వచ్చిన రజనీ.. ఉంటే కమల్ హాసన్ (Kamal Haasan)పై అసూయ ఉంటుంది కానీ విజయ్ పై ఎందుకు ఉంటుందంటూ వ్యాఖ్యానించి మరో కొత్త చర్చకు తెరదీశారు.
దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ కు తనపై అసూయ ఎందుకు ఉంటుందని, ఉంటే పోటీ ఉంటుంది తప్ప అని తేల్చేశారు. తామిద్దరం ఇరవయ్యేళ్ల వయసులోనే పరస్పరం విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకే వేర్వేరు పంథాల్లో కొనసాగుతూ ఆరోగ్యకరమైన పోటీతోనే రాణిస్తున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. తాము సినీ రంగంలోనే కాదు క్రికెట్ లో ఉన్నా సరే ఇలాగే ఉండేవాళ్లమని కమల్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు రాజకీయాల్లో తనకన్నా ఎంతో జూనియర్ అయిన విజయ్ .. టీవీకే పార్టీతో ఎంట్రీ ఇవ్వడం, తాజాగా ముఖ్యమంత్రి కూడా కావడంతో రజనీకాంత్ ఆయన విషయంలో అసూయగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పాటైన పరిస్ధితుల్లో డీఎంకే-అన్నాడిఎంకే కూటముల్ని కలిపి విజయ్ ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ రెండు ప్రచారాల్ని రజనీకాంత్ ఇవాళ ఖండించారు. విజయ్ సీఎం కావడంతో షాకయ్యానంటూనే, ఆయనపై తనకు ఎలాంటి అసూయా లేదన్నారు.














Click it and Unblock the Notifications