వేడెక్కిన వరంగల్: కోర్టులో లాయర్ల వంటలు

జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా జరిగే బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేసేం దుకు అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, కార్మిక, వ్యాపార, మేధావి, వృత్తి, కుల సంఘాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గత బంద్‌లకు భిన్నంగా బుధవారం ఇచ్చిన పిలుపులో వేలాది మంది ప్రజలు భాగస్వామ్యమై రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వ్యక్తం చేయాలని జేఏసీ కోరింది.
శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 24వ తేదీన ఇచ్చిన 48 గంటల బంద్ సందర్భంగా వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక సంఘటనలు జరుగకుం డా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే జిల్లాకు వచ్చిన పారామిలటరీ, ప్రత్యేక రక్షణ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లు ప్రధాన సెంటర్‌లలో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం బంద్ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైనచర్యలు తీసుకుంటున్నారు. కాగా, పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జేఏసీ పట్టుదలతో ముందుకు సాగుతోంది.