Vinesh Phogat: వినేష్ ఫోగట్ కు బిగ్ షాక్- నిషేధం వేటు, షోకాజ్ నోటీసు..!

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రేప్, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఒలింపిక్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె చేసిన ఆరోపణలపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తిరిగి ఆమెపైనే ఎదురు చర్యలు తీసుకుంది. వినేష్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు నిషేధం సైతం విధిస్తూ సంచలన ఉత్తర్వులు ఇచ్చింది.

Haryana polling: ఓటేసిన మనూ బాకర్, వినేష్ ఫోగట్- 1 గంటకు 36.7 శాతం పోలింగ్..!
Haryana polling: ఓటేసిన మనూ బాకర్, వినేష్ ఫోగట్- 1 గంటకు 36.7 శాతం పోలింగ్..!

క్రమశిక్షణారాహిత్యం, యాంటీ-డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో రెజ్లింగ్ సమాఖ్య వినేష్ ఫోగట్ కు ఈ షోకాజ్ నోటీసు జారీ చేసింది. రిటైర్మెంట్ నుండి తిరిగి వచ్చే అథ్లెట్లకు UWW యాంటీ-డోపింగ్ నియమాల ప్రకారం తప్పనిసరి అయిన ఆరు నెలల నోటీస్ కాలాన్ని పూర్తి చేయలేకపోవడంతో జూన్ 26 వరకు ఆమె దేశీయ ఈవెంట్లకు అనర్హురాలిగా ప్రకటించింది. 15 పేజీల ఈ నోటీసులో.. వినేష్ ప్రవర్తన దేశానికి ఇబ్బంది కలిగించి, భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని తెలిపింది. ఈ నోటీసుకు 14 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని WFI వినేష్‌ను కోరింది

WFI Bans Vinesh Phogat Till June 26 Issues Show-Cause Notice in Major Crackdown

WFI రాజ్యాంగం, UWW అంతర్జాతీయ రెజ్లింగ్ నియమాలు, యాంటీ-డోపింగ్ నిబంధనలను ఆమె ఉల్లంఘించారని సమాఖ్య పేర్కొంది. సమాఖ్య మొత్తం నాలుగు ప్రధాన ఆరోపణలపై వినేష్ వివరణ కోరింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు బరువు తగ్గలేకపోవడం, యాంటీ-డోపింగ్ నిబంధనల కింద 'వేర్‌బౌట్స్' వివరాలు ఇవ్వకపోవడం, మార్చి 2024లో IOA-నియమిత తాత్కాలిక ప్యానెల్ నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో రెండు కేటగిరీల్లో పోటీపడటం వంటివి ఉన్నాయి. మే 10 నుండి 12 వరకు గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటుతో సహా, ఈ ఏడాది జూన్ 26 వరకు ఆమె ఏ దేశీయ ఈవెంట్‌కు అర్హురాలు కాదని సమాఖ్య స్పష్టం చేసింది. అలాగే నోటీసులో.. ఏ రాబోయే పోటీల్లో సమాఖ్యకు ప్రాతినిధ్యం వహించడానికి మిమ్మల్ని అనర్హురాలిగా చేసే యాంటీ-డోపింగ్ నియమాలను మీరు ఉల్లంఘించలేదని సమాఖ్య సంతృప్తి చెందాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+