బుధ గురు శుక్రుల అనుకూలత.. సెప్టెంబర్ 15 వరకు ఈ రాశులవారికి సుడి తిరిగినట్టే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితి అన్ని రాశులవారిపైన ప్రభావం చూపుతుంది. జులై 26 నుండి సెప్టెంబర్ 15 వరకు గ్రహాల రాకుమారుడు బుధుడు, దేవతల గురువు బృహస్పతి, సంపదల కారకుడు శుక్రుడు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తూ కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు. దీంతో ఆయా రాశులవారు ఆర్ధికంగా, సామాజికంగా గణనీయమైన ఫలితాలను చూస్తారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మిధునరాశి
ధన స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా, రాశి అధిపతి అయిన బుధుడు ధనస్థానంలోకి వెళ్ళటం కారణంగా ఈ రాశులవారి ఆర్దిఅక్ స్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.ఉధ్యొగ్కస్థులకు జీతం పెరిగే అవకాశం ఉంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. షేర్లు, ఇన్వెస్ట్ మెంట్ లు కలిసి వస్తాయి.

కర్కాటక రాశి
గురువు ఉచ్చ స్థితితో పాటు లాభాదిపతి శుక్రుడు, ధనాధిపతి సూర్యుడు అనుకూలంగా ఉండటం వలన ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ లలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి గురువు ఉచ్చస్థితి, శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించటం, బుధుడు లాభ స్థానంలో ఉండటం వలన ధనయోగాలు ఏర్పడతాయి. కన్యా రాశి జాతకులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ లలో మంచి లాభాలు వస్తాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమై ఆస్తి లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి
ధన కారకుడు అయిన గురువు భాగ్య స్థానంలో ఉండటం, లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభ స్థానంలోకి రావటం వలన వృశ్చిక రాశి వారికి ఊహించని ధనయోగాలు కలుగుతాయి.వీరికి ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. ఆస్తుల విలువ పెరిగి, వివాదాలు ముగిసి విలువైన ఆస్తి చేతికి అందుతుంది.
మకర రాశి
సప్తమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా మకరరాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంది.
మీనరాశి
మీనరాశికి అధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చంగా ఉండటం, ధన భాగ్యాధిపతి కుజుడు కూడా అనుకూలంగా ఉండటం వలన మీనరాశి వారికి కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. ఆస్తులు, తండ్రి తాలూకు సంపద వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్ మంచి లాభాలను ఇస్తుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications