జులై 21న ఈ రాశుల పంట పండుతుందని నిర్ణయించిన ముఖ్య గ్రహాలు!
జ్యోతిష శాస్త్రం ప్రకారం జూలై 21వ మంగళవారం నాడు శని మీనరాశిలో సంచారం చేస్తూ వృత్తి ఉద్యోగాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఆర్థిక స్థితిగతుల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ వ్యక్తిగత సంబంధాలు సుఖసంతోషాల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండగా, బుధుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. నేడు రాశులఫలాలు చూద్దాం.
మేషరాశి
మేష రాశి జాతకులకు కుజుడి అనుకూలత కారణంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. నేడు మేషరాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

వృషభ రాశి
వృషభ రాశి లోనే కుజుడు ఉన్నందువల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు పని ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబంలో మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు వస్తాయి.
మిధున రాశి
బుధుడి సంచారం వల్ల మిధున రాశి వారికి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్న కారణంగా కారణంగా ప్రభుత్వ పనుల వల్ల ధన లాభం వస్తుంది. మితిమీరిన అలసట వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
సింహరాశి
శుక్ర సంచారంతో సింహ రాశి జాతకులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది.
కన్య రాశి
కన్యారాశి జాతకులకు పాత బాకీలు వసూలు కావటంతో ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. సహోద్యోగుల సహాయంతో కష్టమైన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది.
తులా రాశి
నేడు తులా రాశి వారికి రాబడి బాగున్నా అంతే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో మంచి వార్తలు వింటారు.
వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారు భూములు లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త వహించటం మంచిది. వీరికి కష్టానికి తగిన ఫలితం ఆలస్యమైన వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది.
మకర రాశి
మకర రాశి జాతకులు అనుకోని వనరుల నుండి ధనలాభం పొందుతారు. కష్టపడి పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆహార నియమాలలో శ్రద్ధ వహించటం అవసరం .
కుంభరాశి
కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ఆలోచనలు ఆఫీస్ లో బాగా వర్కవుట్ అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇరుగు, పొరుగు వారితో ఉన్న గొడవలు సద్దు మణుగుతాయి.
మీన రాశి
శని ప్రభావం కారణంగా మీన రాశి వారి పనులలో కొంత జాప్యం కావచ్చు. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. కంటి సమస్యలు, కాళ్ళ నొప్పుల విషయంలో జాగ్రత్త.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications