UPI: సిగ్నల్ అక్కర్లేదు.. ట్యాప్ చేస్తే చాలు! NPCI కీలక అప్‌డేట్

మన దేశంలో టీ కొట్టు నుంచి పెద్ద మాల్ వరకు ఏది కొనాలన్నా యూపీఐ (UPI) వాడటం అలవాటుగా మారిపోయింది. అయితే ఫోన్లో సిగ్నల్ రాకపోయినా, సర్వర్ డౌన్ ఉన్నా ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆకాశంలో వెళ్లే విమానాల్లో లేదా రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయక పేమెంట్లు ఆగిపోతుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) అడుగులు వేస్తోంది. నెట్‌వర్క్ అసలు లేకపోయినా సరే, చాలా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునే సరికొత్త వ్యవస్థను ఎన్‌పీసీఐ రూపుదిద్దుతోంది.

ఈ కొత్త విధానంలో ఎలాంటి పిన్ (PIN) నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే రూ. 2,000 వరకు చెల్లింపులు చేయవచ్చు. మన వద్ద ఉన్న ఎన్‌ఎఫ్‌సీ (NFC - నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ (PoS) స్వాపింగ్ మెషిన్‌కు జస్ట్ 'ట్యాప్' (తాకిస్తే) చేస్తే చాలు.. పేమెంట్ పూర్తయిపోతుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. కస్టమర్ ఫోన్‌లో గానీ, లేదా వ్యాపారి వద్ద ఉన్న మెషిన్‌లో గానీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా ఈ లావాదేవీ విజయవంతమవుతుంది.

NPCI Offline UPI Upgrade Tap to Pay Up to Rs 2000 Without Internet Connection in Underground Metros amp amp Flights

దీనికోసం ప్రయాణికులు లేదా వినియోగదారులు ముందుగానే నెట్‌వర్క్ ఉన్న సమయంలో తమ ఫోన్‌లోని 'యూపీఐ లైట్' (UPI Lite) వ్యాలెట్‌లో కింత డబ్బును లోడ్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. సిగ్నల్ లేని ప్రదేశాల్లో వ్యాపారి మెషిన్‌కు ఫోన్ తాకించగానే, ఆ వ్యాలెట్ నుంచి డబ్బు కట్ అయి వ్యాపారి సిస్టమ్‌లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఆ మెషిన్‌కు నెట్‌వర్క్ లభించిన వెంటనే ఆ సమాచారం బ్యాంక్‌కు చేరి, వ్యాపారి ఖాతాలో జమ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) పరికరాలను ఎన్‌పీసీఐ సర్టిఫై చేయనుంది.

ఇప్పటికే ఎన్‌పీసీఐ గతంలో 'యూపీఐ లైట్ ఎక్స్' పేరుతో ఆఫ్‌లైన్ చెల్లింపుల సదుపాయాన్ని తెచ్చినప్పటికీ, ప్రస్తుతం తీసుకువస్తున్న విధానం నేరుగా దుకాణాలు, విమానాల్లో ఉండే రెగ్యులర్ స్వాపింగ్ మెషిన్లలో పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిమితులు ఉన్నప్పటికీ, ఈ కొత్త విధానంలో ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 2,000 వరకు అనుమతించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ చెల్లింపుల సరళి మరో స్థాయికి చేరడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+