GATE 2027: కొత్తగా ఆ క్రేజీ కోర్సు! సిలబస్‌ సమూల ప్రక్షాళన

దేశంలోనే అత్యున్నత ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు రహదారిగా నిలిచే 'గేట్-2027' (GATE 2027) పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ తాజాగా విడుదల చేసింది. నేటితరం విద్యార్థుల ఆకాంక్షలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈసారి సబ్జెక్టుల ఎంపిక నుంచి దరఖాస్తు విధానం వరకు పలు కీలక మార్పులను చేపట్టింది.

ఈ సారి పరీక్షల్లో అత్యంత ప్రధానంగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని "రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ (RA)" పేరుతో కొత్త పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో గేట్‌ రాసే మొత్తం సబ్జెక్టుల సంఖ్య 30కి చేరింది. దీనితో పాటు 'టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్' పేపర్‌ను ఇంజినీరింగ్ సైన్సెస్ పరిధిలోకి మార్చారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గేట్ సిలబస్‌ను ఐఐటీ మద్రాస్ సమూలంగా ప్రక్షాళన చేయడం విశేషం.

GATE 2027 Schedule Released IIT Madras Introduces Robotics Paper and DigiLocker Registration Feature

పరీక్షల తేదీలు ఇవే..

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (CBT) వచ్చే ఏడాదైన 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో వివిధ విడతల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ - స్టెప్ బై స్టెప్ గైడ్

ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు కింద పేర్కొన్న వివరాల ఆధారంగా సులభంగా అప్లై చేసుకోవచ్చు:

  • స్టెప్ 1: మొదటగా గేట్ 2027 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. (https://gate.iitm.ac.in/)
  • స్టెప్ 2: యాక్టివ్‌గా ఉన్న మీ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉపయోగించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • స్టెప్ 3: అనంతరం మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతల మార్కులను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • స్టెప్ 4: విద్యార్థికి సంబంధించిన లేటెస్ట్ ఫొటో, సంతకం, అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలను స్క్రాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • స్టెప్ 5: ఈసారి భద్రత - అభ్యర్థుల వివరాల ధ్రువీకరణను మరింత పారదర్శకంగా చేయడానికి 'డిజిలాకర్' (DigiLocker) ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
  • స్టెప్ 6: అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ విధానాల ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
  • స్టెప్ 7: ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలి.

సిలబస్‌లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించే ముందే నూతన సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి సర్టిఫికేట్లు, ఐడీ ప్రూఫ్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+