భారత్ 'ఆపరేషన్ సింధూర్' బిగ్ సక్సెస్: ఎట్టకేలకు ఓపెన్ అయిన పాకిస్థాన్..!!

జమ్మూకాశ్మీర్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనక పాకిస్థాన్ ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. వందలాదిమంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ విజయాన్ని పాకిస్థాన్ ఆర్మీ ఫ్యాబ్రికేట్ చేసిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజి స్పష్టం చేశారు. భారత్ తో నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయం సాధించిందని ఆ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ దాచిపెట్టిందని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నొరీన్ నియాజీ ఈ విషయంపై స్పందించారు. పాకిస్థాన్ పై భారత్.. ఆపరేషన్ సింధూర్ భారీ విజయం సాధించిందని అన్నారు. కానీ ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ దాచి పెట్టిందని తెలిపారు. ఈమె వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నియాజీ వ్యాఖ్యలపై దేశంలోని నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది.

NoreenNiazi sister former Pakistan Prime Minister Imran Khan makes key remarks on Operation Sindhur

నొరీన్ నియాజీ.. ప్రభుత్వంపై కావాలనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది. సోషల్ మీడియాలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఆమె వ్యాఖ్యలు పాకిస్థాన్ లో తీవ్ర దుమారం రేపాయి. ఇక పాకిస్థాన్ లోని కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, అలాగే అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లను భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+