Exclusive: డీఎస్సీలో ఏం జరిగింది ? అధికారుల పాత్ర ఎంత? నిపుణుల వాదనేంటి ?

ఏపీలో గతేడాది కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షపై ఏడాది ఆలస్యంగా మొదలైన వివాదాలు అప్పటి నుంచీ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ అక్రమాల పుట్ట అని విపక్ష వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా.. కూటమి ప్రభుత్వం మాత్రం చర్చకు రెడీ అంటూ ఇప్పటికీ సవాళ్లు విసురుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విపక్షం ఆరోపిస్తున్నట్లుగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే ఉన్నాయా, లేక ప్రభుత్వం చెబుతున్నట్లు అసలు తప్పులే జరగలేదా ? తెలుసుకునేందుకు వన్ ఇండియా ప్రయత్నించింది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాల్లో కీలకంగా మారిన స్పోర్ట్స్ కోటా అక్రమాల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి, విశ్లేషకుడు కూడా అయిన కేపీ రావుతో మాట్లాడి వివరాలు సేకరించింది.

మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!
మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!

డీఎస్సీ ఎందుకు వివాదాస్పదమైంది ? (AP DSC 2025 Row)

గతేడాది రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షపై వైసీపీ పలు ఆరోపణలు చేసింది. ఇందులో ప్రశ్నాపత్రాలు తయారు చేసిన టీమ్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రెండు జిల్లాల్లో ఉద్యోగాలకు అర్హత సాధించడం దగ్గరి నుంచీ మెరిట్ లిస్ట్ బయటపెట్టకపోవడం వరకూ చాలానే ఉన్నాయి. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా, సెలెక్షన్ జాబితా బయటపెట్టకుండా ఎంపికైన అభ్యర్ధులకు నేరుగా మెసేజ్ లు పంపడం ఉన్నాయి., పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇవ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు, వాటిని జారీ చేసిన క్రీడాసంఘాల పాత్ర విమర్శలకు కారణమైంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు బదులు సబ్జెక్ట్ టీచర్లుగా ఎంపిక చేయడంపైనా ప్రశ్నలు వచ్చాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ వర్తింపచేసినా, అభ్యర్ధులకు ముందే చెప్పలేదన్న ఆరోపణలు వచ్చాయి

Exclusive AP DSC 2025 Row What Went Wrong and Who Is Accountable Why Is YSRCP Targeting Lokesh

అధికారులతో సర్కార్ వివరణలు

డీఎస్సీలో అన్నీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించడం, పలువురు బాధిత అభ్యర్ధులు బయటికి వచ్చి ఆధారాలు బయటపెడుతున్నా ప్రభుత్వ పెద్దలు అధికారులతో వివరణలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. ఇందులో ముందుగా సీనియర్ అధికారులైన ఐఏఎస్ లు కోన శశిధర్, అజయ్ జైన్ వంటి వారు వివరణలు ఇస్తే.. ఆ తర్వాత జూనియర్ అధికారులైన ఐఏఎస్ లు తమీమ్ అన్సారియా (విద్యాశాఖ కమిషనర్), ఐఏఎస్ భరణి (శాప్ వీసీ, ఎండీ) కూడా వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. అయినా వైసీపీ మాత్రం వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. మరోవైపు ఈ వివాదంపై జోక్యానికి హైకోర్టు ఇప్పటికే నిరాకరించింది.

ఏపీలో కోచింగ్ సెంటర్లకు సర్కార్ షాక్..! డీఎస్సీ పోరు ఎఫెక్ట్ ?
ఏపీలో కోచింగ్ సెంటర్లకు సర్కార్ షాక్..! డీఎస్సీ పోరు ఎఫెక్ట్ ?

లోకేష్ నే వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

మెరిట్ ఆధారంగా చర్చించాల్సిన డీఎస్సీ అవకతవకల వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ విమర్శలు రాజకీయ అంశంగా మార్చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. డీఎస్సీ తప్పిదాల్ని వైసీపీ బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ సమాధానం ఇవ్వలేదంటూ వైసీపీ ప్రశ్నించడం వెనుక ఈ వ్యవహారంలో భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉన్న నేతను రాజకీయంగా దెబ్బతీసేందుకే అన్న వాదన ఉంది. డీఎస్సీ ఆరోపణలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని లోకేష్ ఇప్పటికే పలుమార్లు సవాల్ విసిరినా వైసీపీ స్పందించలేదు. దీంతో ఇదో రాజకీయ రచ్చ గానే మిగిలిపోతోంది. తాజాగా శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిరసనలు కూడా హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది.

Exclusive AP DSC 2025 Row What Went Wrong and Who Is Accountable Why Is YSRCP Targeting Lokesh

నిపుణులు ఏమంటున్నారు?

డీఎస్సీలో అన్నీ అక్రమాలు జరగాయన్న వైసీపీ వాదనలో పసలేదని ప్రముఖ విద్యావేత్త, అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. కటాఫ్ మార్కులు బహిరంగంగా ప్రకటించకపోవడం, మార్కులతో సెలెక్షన్ జాబితా విడుదల చేయకపోవడం, వ్యక్తిగతంగా సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు మెసేజ్ లు పంపడం, పరీక్షలు లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇవ్వడం, వాటిని జారీ చేసిన క్రీడాసంఘాల పాత్రను నాగేశ్వర్ ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు బదులు సబ్జెక్ట్ టీచర్లుగా ఎంపిక కావడంపై ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి ప్రభుత్వం అధికారులతో పలుమార్లు సమాధానాలు చెప్పించింది. అయినా వైసీపీ మాత్రం పదే పదే అవే ఆరోపణలు తెరపైకి తెస్తుండటం టెక్నికల్ గా తేలాల్సిన అంశాన్ని రాజకీయంగా మార్చేస్తుందన్న చర్చ జరుగుతోంది.

డీఎస్సీ పై పోరాటంలో వైసీపీ మరో కీలక నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!!
డీఎస్సీ పై పోరాటంలో వైసీపీ మరో కీలక నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!!

క్రీడా వర్గాల వాదనేంటి?

స్పోర్ట్స్ కోటాలో అభ్యర్ధులు సమర్పించిన సర్టిఫికెట్లను ధృవీకరించాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ శాప్ అధికారులు.. ఈ ధృవీకరణ కోసం తిరిగి ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన క్రీడాసంఘాల వద్దకే పంపడం దురదృష్టకరమని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు.. వన్ ఇండియా తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 382 ఉద్యోగాలూ అక్రమం కాదని, ఇందులో నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. క్రీడాసంఘాలతో శాప్ అధికారుల కుమ్మక్కు వల్ల కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే విధానం దేశంలో ఇప్పటికే అమల్లో ఉందని తెలిపారు. అధికారులపై అతిగా ఆధార పడటం వల్లే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోందన్నారు. అంతిమంగా అధికారుల తప్పిదాలకు ప్రభుత్వం విమర్శలు పడాల్సి వస్తోందని ఆయన తేల్చిచెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+