అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి బెయిలుపై కొద్దిసేపట్లో విడుదలవుతారు. హైదరాబాద్‌లో జరిగిన కారు బాంబు కేసులో సూరికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇప్పటి వరకు సూరి 12 ఏళ్లు శిక్ష అనుభవించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ క్షమాబిక్షపై ఆయన విడుదల కావలసి ఉంది. అయితే ఆయన పరిటాల రవి హత్య కేసులో నిందితుడైనందున జైలులోనే ఉన్నారు. ఈ కేసులో ఆయనకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరైంది. అనంతపురం జిల్లాలో ఉండకూడదని కోర్టు నిబంధన విధిస్తూ బెయిలు మంజూరు చేసింది.
హైదరాబాద్‌లోని నిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన సూరిని ఇక్కడి జిల్లా జైలుకు తీసుకువచ్చారు. బెయిలుపై విడుదలయ్యేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన జైలుకు రాగానే విడుదల చేస్తారు. ఈ సందర్భంగా వందల సంఖ్యలో ఆయన అభిమానులు, బంధువులు జిల్లా నలుమూల నుంచి జిల్లా జైలుకు చేరుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి