వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రద్దీ కారణంగా తిరుమలలో లడ్డూల కొరత

తిరుమలలో రోజుకి లక్షా 25 వేల లడ్డులను మాత్రమే తయారు చేస్తారు. భక్తుల రద్దీ ఎక్కువవడం, లడ్డుల కొరత ఏర్పడడంతో విచక్షణ కోటా అంటే సిఫారసు లేఖలపై ఇచ్చే లడ్డులను టిటిడి రద్దు చేసింది. జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరం కారణంగా భక్తుల రద్దీ తీవ్రంగా ఉండి మళ్ళీ లడ్డూల కొరత ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేసుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో మంగళవారం మహ ద్వార ప్రవేశం రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏకాదశి సందర్భంగా సోమవారం లక్షలాది మంది తరలిరావడంతో యంత్రాంగం విస్తృత సేవలు అందించిందని టీటీడీ పీఆర్వో రవి ఒక ప్రకటనలో తెలిపారు.